సీఎం చంద్రబాబు ఈరోజు కీలక సమీక్ష
AP: సీఎం చంద్రబాబు మంత్రులతో ఈరోజు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మధ్యాహ్నం 12:30 గంటలకు మంత్రులతో సమావేశం కానున్నారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను మంత్రులు సేకరించారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.