అధ్వాన్నంగా కారంచేడు-ఆదిపూడి ప్రధాన రహదారి
BPT: కారంచేడు నుంచి ఆదిపూడి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణించాలంటే నరకయాతనగా ఉందని వాహనదారులు అంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా పయనిస్తూ ఉంటాయని రాత్రి వేళలో ఈ మార్గం గుండా పయనించాలంటే ఎక్కడ ప్రమాణాలు జరుగుతాయో భయంగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.