వేదగిరి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

వేదగిరి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు

నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ. 8.75 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని టీడీపీ నేతలు సత్కరించారు. శనివారం మంత్రి నివాసంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.