కాలువల ఆధునీకరణ పనులు పరిశీలించిన మంత్రి
నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్ హనుమాయమ్మ సందులో రోడ్డు, 48వ డివిజన్లో ఉయ్యాల కాలువ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. రూ.50 కోట్లతో 8 కాలువల పనులు శరవేగంగా సాగుతున్నాయని, ముంపు నివారణే లక్ష్యమని తెలిపారు. 2017 పరిస్థితి మళ్లీ రాకూడదనే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. స్థానికులు మంత్రికి బ్రహ్మరథం పట్టారు.