ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
NGKL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం పాల్గొన్నారు. బోరబండ డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.