ఇందిరమ్మ చీరల ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
SDPT: బెజ్జంకి మండల కేంద్రం నుంచి దేవక్కపల్లి గ్రామానికి ఇందిరమ్మ చీరలు తీసుకెళ్తున్న ఆటో దాచారం స్టేజి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దేవక్కపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.