హిమవంత రావు సేవలు చిరస్మరణీయం: మంత్రి
KMM: ఖమ్మం పీఆర్టీయూ భవన్‌లో ఆ సంఘ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్సీ దివంగత సామినేని హిమవంతరావు విగ్రహాన్ని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమవంతరావు క్రమశిక్షణ, నిజాయతీ కలిగిన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్సీగా, మార్కెట్ ఛైర్మన్‌గా ఉపాధ్యాయుల, రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు.