ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి: ఎస్పీ
ASF: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నితికా పంత్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి మొదటిసారి కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ను సందర్శించారు. ఈ మేరకు స్థానిక ఆదివాసీలు ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని, గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.