విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్

VSP: ఇన్ఫోసిస్ విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఎండాడ, పరదేశిపాలెం సమీపంలో కంపెనీ ప్రతినిధులు భూముల పరిశీలన చేపట్టారు. ఎకరం 99 పైసల చొప్పున 20 ఎకరాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ నెలాఖరులో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.