ప్రమాదానికి దారితీస్తున్న ముచింపుల ప్రధాన రహదారి
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల నుంచి మహ్మద్ గౌస్‌పల్లెకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా ముచింపుల గ్రామ శివారులోని పులి సింగ్ బావి వద్ద రోడ్డుకు ఇరువైపులా పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు, స్కూల్ వ్యాన్ విద్యార్థులు భయాందోళనతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలు పుడ్చాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.