'అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలి'
GDWL: గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించారు. పాఠశాల విద్యార్థులతో వారు నేర్చుకున్న అంశాలను చదివించి ఆప్యాయంగా పలకరించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి ఆరా తీశారు.