అదుపుతప్పి కింద పడి యువకుడు మృతి.!

KDP: కడప నగర పరిధిలోని దేవుని కడపలో బైక్‌పై నుంచి పడి ప్రణుష్ రెడ్డి (14) 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా ఆటో వస్తుండడంతో తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.