డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

VSP: షీలా నగర్ నుంచి కాన్వెంట్ వైపు వెళుతున్న కారు మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరకి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.