నా జన్మ ధన్యమైంది: సీఎం చంద్రబాబు
AP: పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చినప్పుడు రైతుల్లో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం కావాలో అంత అయ్యిందని, వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చినట్లు సీఎం తెలిపారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలుపాలని అన్నారు.