సంతోషం, ఐక్యత తీసుకురావాలి: ఎస్పీ

MDK: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అక్కతమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికీ సంతోషం, ఐక్యత, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.