వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరికలు

తూర్పుగోదావరి: ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వైసీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన మోకా అప్పాజీ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు 20మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ పాలన పట్ల విసుగు చెంది టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.