VIDEO: గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం!
MBNR: జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలోని పోతిరెడ్డి చెరువు వాగులో గల్లంతైన అంబఠాపురం గ్రామానికి చెందిన తానం బాలయ్య దంపతుల మృతదేహాలను శుక్రవారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం వెలికితీసింది. ఈ సందర్భంగా గ్రామస్థుడు పాలెం రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేద బాలయ్య కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.