తారు రోడ్డు పనులు ప్రారంభం: ఎమ్మెల్యే

తారు రోడ్డు పనులు ప్రారంభం: ఎమ్మెల్యే

ASR: హుకుంపేట మండలం తడిగిరి పంచాయితీ కొండ చీడిపుట్టు, బర్రెంగి బంధ గ్రామాలకు ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో రూ.5.50 కోట్ల వ్యయంతో చేపట్టిన తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం ప్రారంభించారు. రోడ్డు మంజూరుతో మారుమూల గ్రామాల ప్రజలకు డోలి కష్టాలు తీరనున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు పాల్గొన్నారు.