కాళేశ్వరంలో లక్ష కుంకుమార్చన పూజ

PDPL: శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ శుభానంద అమ్మవారి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం అలాగే సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణము ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు అందరు కూడా పాల్గొని ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమం అలాగే లలితా సహస్రనామ పారాయణములో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు తెలిపారు.