ఎంపీ అంబికా లక్ష్మినారాయణకు సన్మానం

సత్యసాయి: హిందూపురం రహమత్ సర్కిల్ వద్ద అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన సన్మానం చేశారు. హిందూపురం రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు హాల్ట్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తమైంది. అనంతరం ఎంపీ లేపాక్షి మండలంలోని కంచి సముద్రం గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనం చేసి, వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేశారు.