యూరియా కొరతపై.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

KNR: తెలంగాణలో యూరియా కొరతపై కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే యూరియాను బ్లాక్ చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దీనిపై తమకు సమాచారం ఉందని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన కేటీఆర్ తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సైకో, శాడిస్ట్‌ల ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.