VIDEO: అర్ధవీడులో అక్రమ మద్యం పట్టివేత
ప్రకాశం: అర్ధవీడు మండలం చేర్లో దొనకొండ గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద 10 క్వార్టర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ.. బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.