ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు రాకపోకలు బంద్

MDK: రామయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ శివారులో పుష్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో పుష్పల వాగు నీటి ప్రవాహానికి రోడ్డు పూర్తిగా కొట్టిపోయింది దీంతో పర్వతాపూర్‌కు అవతలున్న తండాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.