ఫుడ్ డెలివరీ సేవలను నిలిపేసిన ఓలా!

ఫుడ్ డెలివరీ సేవలను నిలిపేసిన ఓలా!

ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ఓలా తన ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేసిన్నట్లు తెలుస్తోంది. యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత ఓలా ఫుడ్స్ సేవలు ఇకపై అందుబాటులో లేవని కనిపిస్తున్నట్లు మనీకంట్రోల్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఓలా ఫుడ్స్‌ను పునఃప్రారంభిస్తుందా లేదా వ్యాపారాన్ని పూర్తిగా వదిలేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.