టీడీపీలో పలువురు చేరికలు

గుంటూరు: రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామానికి చెందిన పరిసా రాజు, మోర్ల రమేష్, కేసన రత్నరాజు(వాలంటీర్), పేరం గోపి, కేసన శివయ్య లు శుక్రవారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే అనగాని పార్టీ కండవా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుందని అనగాని చెప్పారు.