VIDEO: సింహవాహనంపై భావన్నారాయణస్వామి గ్రామోత్సవం

KKD: రూరల్ సర్పవరంలోని శ్రీ భావన్నారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం రాత్రి స్వామివారిని సింహవాహనంపై ఆశీనులు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. సింహవాహనానికి ముందు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామోత్సవం వైభవంగా జరిగింది.