పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే?
చలికాలంలో పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. అలాగే పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెతో పాదాలను మంచిగా మసాజ్ చేయాలి. అలాగే పాదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. సరైన చెప్పులు ధరించాలి. గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. బయటికి వెళ్లినప్పుడు సాక్సులు ధరించాలి.