'తెగుళ్ల నివారణకు డ్రోన్లతో మందులు పిచికారి చేయాలి'
E.G: గోకవరం(మం) రంపఎర్రంపాలెంలో రబీ వరి పంటను ఆశించే తెగుళ్లు, పురుగులను అరికట్టడానికి డ్రోన్ల సహాయంతో మందులు (కాషాయం) పిచికారీ చేసుకోవాలని ఎం.డీ.ఎల్. బసవన్న గౌడ్ గురువారం సూచించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోని RSKల్లో డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. రైతులు ఈ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని తక్కువ సమయంలో, సమర్థవంతంగా పిచికారీ చేసుకోవాలన్నారు.