నేడు 'డయల్ యువర్ కమిషనర్' కార్యక్రమం

నేడు 'డయల్ యువర్ కమిషనర్' కార్యక్రమం

కృష్ణా: తాగునీటి సమస్యలపై నేడు 'డయల్ యువర్ కమిషనర్' కార్యక్రమం నిర్వహించనున్నారు. వేసవి కాలం నేపథ్యంలో గుడివాడ పురపాలక సంఘం కమిషనర్ పరిదిలో ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యల్ని కమిషనర్ సింహాద్రి మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలపై ఉదయం 11 గంటల నుంచి 12 వరకు పోన్ చేసి చెప్పవచ్చు.