చార్మినార్ ఎమ్మెల్యేకు వినతి

HYD: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఎమ్మెల్యే కలిశారు. వారి సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎటువంటి సమస్యలున్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.