సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

E.G: అనపర్తి మండలం కుతుకులూరులో గురువారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేశారు. నూతన పెన్షన్లు మంజూరైన నేపథ్యంలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ కుతుకులూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పింఛన్ రూ. 4 వేలు ఇవ్వడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.