VIDEO: భక్తిశ్రద్ధలతో ఉమా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు
SKLM: ఆమదాలవలస పట్టణంలో అతి పురాతనమైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు కాళీ శర్మ స్వామి వారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పరిసర ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.