చింతపల్లిలో భారీ సర్పం హల్ చల్..

ASR: చింతపల్లిలో గురువారం ఓ భారీ విష సర్పం హల్ చల్ చేసింది. ఓ ఇంట్లోకి చాలా పొడవైన పాము ప్రవేశించింది. దీంతో వారు హడలెత్తిపోయారు. గమనించిన స్థానికులు ప్రాణభయంతో ఆ పామును హతమార్చారు. అయితే పాము రంగు వింతగా ఉందని, ఇలాంటి పామును తాము ఎక్కడా చూడలేదని చెబుతున్నారు. అయితే దీనిని గోల్డెన్ ట్రీ స్నేక్ అని, ఇది గాలిలో ఎగురుతుందని అంటున్నారు.