ఇంటి పైకప్పు పెచ్చు ఊడి మహిళకు గాయాలు
VZM: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు బొబ్బిలి మున్సిపాలిటీలోని అప్పయ్య పేటలో ఇంటి స్లాబ్ నానాడంతో సోమవారం రాత్రి పెచ్చు ఊడిపడడంతో టి.రమణమ్మ తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబినాయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. వర్షాలు కురవడంతో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు.