భద్రాచలంలో ట్రాఫిక్ తనిఖీలు ప్రారంభం

భద్రాచలంలో ట్రాఫిక్ తనిఖీలు ప్రారంభం

BDK: భద్రాచలం బస్టాండ్ ఎదుట శనివారం ఉదయం 10 గంటల నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులతో పాటు పెండింగ్ చలానాలు ఉన్నవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.