హత్య కేసును ఛేదించిన పోలీసులు

MLG: ఇప్పలగూడెంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తన మేనత్త ఎల్లమ్మను గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నట్లు ASP శివం ఉపాధ్యాయ తెలిపారు. పథకం ప్రకారం హత్య చేసి, గొడ్డలితో పారిపోయిన విజయ్ కుమార్‌ను ఇంటి వద్ద ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.