ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. సోమవారం, పట్టణంలోని 11వ వార్డులో రూ. 11 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం గాంధీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఓపీ రిజిస్టర్ పరిశీలించి, మందులు, ల్యాబ్ రిపోర్టులు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.