VIDEO: 'ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి'
ADB: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ సూచించారు. శుక్రవారం శాలపల్లి, లింగాపూర్, ఆరవెల్లి సహా పలు గ్రామాల్లో ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సర్పంచులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.