జిల్లాకు పిడుగులతో కూడిన వర్ష సూచన

జిల్లాకు పిడుగులతో కూడిన వర్ష సూచన

కోనసీమ: జిల్లాలో ఎండలు దంచికొడుతున్న విషయం తెలసిందే. అయితే, రానున్న 3 రోజుల్లో ఓ పక్క ఎండలు, మరో పక్క మేఘాలతో విభిన్న వాతావరణం నెలకొననున్నట్లు APSDMA పేర్కొంది. అలాగే, ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.