జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడిగా నాగమల్లేశ్వర్ రెడ్డి
ATP: వైసీపీ పార్టీ బూత్ కమిటీ విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వర్ రెడ్డిని నియమించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.