ఎలుకల దాడి ఘటనపై మంత్రి ఆగ్రహం
AP: ఎలుకల దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్, నిర్వహణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.