వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ

WGL: రాయపర్తి సమీపంలో శనివారం సాయంత్రం బొలెరో వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో మైలారం గ్రామానికి చెందిన ఐరెడ్డి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సేవలతో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.