'జీతం తీసుకుంటూ సభకు రాని వాళ్లపై చర్యలు తీసుకోవాలి'

'జీతం తీసుకుంటూ సభకు రాని వాళ్లపై చర్యలు తీసుకోవాలి'

HYD: ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకు రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా సభకు గైర్హాజరావుతూ వస్తున్నారని, జీతం తీసుకుంటూ సభకు రాని వాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఇప్పటికైనా సభకు వచ్చి చర్చించాలని కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.