నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలి

VZM: రైతు సమస్యలపై ఈనెల 13వ తేదీన, విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈనెల 27వ తేదీన వైసీపీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించినందున పోరాటాలు చేసే సమయం ఆసన్నమైనట్లు తెలిపారు.