HYD పోస్ట్ ఆఫీసులో డిజిటల్ లాకర్.. ఇక ఎప్పుడైనా తీసుకోవచ్చు

HYD పోస్ట్ ఆఫీసులో డిజిటల్ లాకర్.. ఇక ఎప్పుడైనా తీసుకోవచ్చు

HYD: హైదరాబాద్ జీపీఓలో త్వరలో డిజిటల్ లాకర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలతో తపాలా శాఖ డెలివరీ వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. పార్సెల్‌లు, ఉత్తరాలను భద్రంగా డిజిటల్ లాకర్‌లో ఉంచి, వినియోగదారులు తమకు అనుకూలమైన సమయంలో స్వయంగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆలస్యాలు తగ్గి, సేవల నాణ్యత పెరగనుంది.