VIDEO: భర్త వేధింపులతో సబ్ కలెక్టరుకు ఫిర్యాదు

VIDEO: భర్త వేధింపులతో సబ్ కలెక్టరుకు ఫిర్యాదు

అన్నమయ్య: మదనపల్లికి చెందిన జోయా ఖాన్ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తన భర్త మహబూబ్ ఖాన్ నుంచి తనకు, తన చిన్న బిడ్డకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. మూడు నెలలుగా భర్త నుంచి దూరంగా ఉంటున్నానని, తన బిడ్డను బలవంతంగా తీసుకెళ్లి తన ఇంటి వద్ద ఉంచుకున్నాడని తెలిపారు. తనను పలుమార్లు కొట్టి, శారీరక, మానసిక హింసకు గురిచేశారని జోయా వాపోయారు.