'రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి'

'రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి'

MDK: చేగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతంగా చేపట్టాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి సూచించారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొనగా చెట్ల తొలగింపు, మిషన్ భగీరథ పైపులైన్ల మార్పు, విద్యుత్ స్తంభాల తొలగింపు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు.