VIDEO: విద్యార్థి ఇంటికి వెళ్లి సన్మానించిన కలెక్టర్

BHNG: సంస్థన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి ఇంటికి స్వయంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు. పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా చేయూత అందిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో భరత్ చంద్ర చారి 73% మార్కులు సాధించడంతో స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి ఘనంగా సన్మానించారు.