వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ బుధవారం సందర్శించారు. ఈనెల 5వ తేదీన వినాయక ఉత్సవాల నిమజ్జనం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. పోలీసులకు ఈ సందర్భంగా తగు సూచనలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.