బాలికను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే

SKLM: అంపోలు గ్రామంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొల్లి అప్పారావు, కొల్లి లలిత, తమ కుమార్తెతో కలిసి పురుగుల మందు సేవించారు. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందగా వారి కుమార్తె మృత్యుంజయురాలుగా బయటపడింది. ఆ బాలికను పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ తల్లిదండ్రులు కోల్పోయారని అధైర్య పడవద్దు అని తాను ఆ అమ్మాయిను దత్తత తీసుకుంటానని చెప్పారు.